చీర, జడలో మల్లె పూలతో దర్శనమిచ్చిన రామ్ బ్యూటీ.. మాటల్లేవ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
చీర, జడలో మల్లె పూలతో దర్శనమిచ్చిన రామ్ బ్యూటీ.. మాటల్లేవ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది.

అయితే ఈ భామ నటన పరంగా బాగానే అలరించిన అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. కానీ తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన వయ్యారాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు కూడా దగ్గరవుతూ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఏ ఫొటో షేర్ చేసిన ఇట్టే వైరల్ అయిపోయి, లక్షల వ్యూస్ వస్తుంటాయి.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ శారీ కట్టుకుంది. అలాగే జడలో మల్లె పూలు పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. తన వాలు కళ్లతో యూత్‌ను ఫిదా చేస్తుంది. ఇక వాటికి ‘హ్యాపీ శివరాత్రి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ అందం చూస్తుంటే మాటల్లేవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ ఫొటోలపై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed