- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nayanthara: లేడీ సూపర్ స్టార్ ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో.. విగ్నేష్ శివన్ రియాక్షన్ ఇదే! (ఫొటోలు)

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara)‘మనస్సినక్కరే’సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హాట్ చిత్రాల్లో నటించి తన అందం, నటనతో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక ఈ అమ్మడు 2006 ‘లక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఇక 2023లో ‘అన్నపూరణి’తో వచ్చిన ఆమె పలు విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆమె 40 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం నయన్, కేజీఎఫ్ హీరో యశ్(Yash) ‘టాక్సిక్’ (Toxic)మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Sivan)ను ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వివాహం తర్వాత నాలుగు నెలల్లోనే కవల పిల్లలు తల్లి అయ్యానని ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే వారికి ఉయిర్, ఉలగ్ అని పేర్లు పెట్టారు. వీరిద్దరు పుట్టినప్పుడు పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవల మగబిడ్డలకు జన్మనిచ్చినట్లు అంతా చర్చించుకున్నారు. పలు విమర్శలు కూడా వచ్చాయి.
అయినప్పటికీ ఆమె ధైర్యంగా అవన్నీ ఎదుర్కొంది. తన కుమారులతో, భర్తతో సంతోషంగా ఉంటూనే వరుస చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం నయనతార కుమారులకు రెండేళ్లు వాళ్లు నడవడం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. తాజాగా, విగ్నేష్ ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు. అందులో నయనతార ఇద్దరు ఆడపిల్లలతో (కవలలు) కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు విగ్నేష్ ‘‘కొన్నిసార్లు ఏఐ కూడా చాలా అందంగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం విగ్నేష్ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఆయనను కూడా పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో ఉన్న నయన్ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన వారంతా వావ్ ఎంత క్యూట్‌గా ఉన్నారో అని కామెంట్లు చేస్తున్నారు.