బర్త్‌డే స్పెషల్‌గా రీరిలీజ్ కాబోతున్న నాని- సమంత సూపర్ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-02-20 13:35:31.0  )
బర్త్‌డే స్పెషల్‌గా రీరిలీజ్ కాబోతున్న నాని- సమంత సూపర్ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌(Re Release)ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అలా మహేష్ బాబు(Mahesh Babu) ‘ఒక్కడు’(Okkadu), ‘పోకిరి’(Pokiri), ‘బిజినెస్ మెన్’(Businessman).. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘జల్సా’(Jalsa), ‘ఖుషి’(Khushi), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘తమ్ముడు’(Tammudu) వంటి చిత్రాలు బాగానే ఆడాయి. ఇక రామ్ చరణ్ ‘ఆరెంజ్’(Orange), ‘ఈ నగరానికి ఏమైంది’(ee Nagaraniki Emaindi) వంటి చిత్రాలు రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టాయి. చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమ తమ అభిమాన హీరోల చిత్రాలను రంగంలోకి దించారు. చాలా చిత్రాలను ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అయితే బేసిక్‌గాప్రేమ కథా చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రేమ కథలు లేకుండా సినిమాలను మాత్రం తీయలేరు. అలా గౌతమ్ మీనన్ తీసే లవ్ స్టోరీస్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలో నాని(Nani), సమంత(samantha)ల సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్యూట్ జంటతో గౌతమ్ మీనన్(Gowtham Menon) చేసిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’(Eto Vellipoindi Manasu) సినిమా ఆడియెన్స్‌ను మెప్పించింది.

పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇళయరాజా(Ilaya Raja) అందించిన మెలోడియస్ గీతాలు అప్పటి ప్రేమికుల్ని తెగ ఆకట్టుకున్నాయి. ఈ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా నేచురల్ స్టార్ నాని బర్త్‌డే రోజు అనగా ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్నిఆర్ట్‌సీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో రీ రిలీజ్ చేయనున్నారు.

అంతేకాకుండా మార్నింగ్ 8 గంటలకు స్పెషల్ షో కూడా వేయనున్నారు. మరి దీని కోసం బుకింగ్స్ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓపెన్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నాని, సమంత ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్‌లో చూసి ఆనందించండి. కాగా ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని ఫోటాన్ కథాస్ సమర్పణలో నిర్మించారు. ఈ మూవీని తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని లక్ష్మీ నరసింహ మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్ట్ 2న రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ రీ రిలీజ్‌కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Next Story