- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ananya Pandey: ఆ హీరోతో నా కూతురు అసౌకర్యంగానే నటించింది.. హీరోయిన్ తండ్రి కీలక వ్యాఖ్యలు!

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) నటుడు చంకీ పాండే( Chunky Pandey ) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’(Student of the Year) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పాపులా సంపాదించుకుంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని భారీ పాపులారిటీతో ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’(Liger) లో నటించింది. పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఇందులో నటించిన వారందరి కెరీర్‌పై ప్రభావం పడింది. దీంతో అనన్య పాండే బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక గత ఏడాది ఈ అమ్మడు ఖేల్ ఖేల్ మే, కంట్రోల్ వంటి చిత్రాలతో వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడుకి అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు మూవీస్‌లో నటిస్తూనే అనన్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లైగర్‌లో చాన్స్ వచ్చినప్పుడు అనన్య నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ఆ సినిమాలో సెట్ కానేమో అనికుంటున్నా నటించాలా వద్దా అని నన్ను సలహా అడిగింది.
దీంతో నేను ఎలాంటి కన్‌ఫ్యూజన్ వద్దు.. పాన్ ఇండియా రేంజ్‌లో చాలా పెద్ద ప్రాజెక్ట్‌లో చాన్స్ వచ్చింది కాబట్టి ఓకే చెప్పు. సినిమా విజయం సాధిస్తే.. భవిష్యత్‌లో మంచి పేరు వస్తుందని చెప్పాను. దీంతో ఆమె ఓకే చెప్పింది. విజయ్‌తో ఆమె అసౌకర్యంగానే నటించింది. అయితే లైగర్ విడుదల తర్వాత వచ్చిన రివ్యూలు చూసి నా నిర్ణయం తప్పు అనిపించింది. తను చెప్పినట్లుగాను స్క్రీన్‌పై చాలా యంగ్‌గా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఎప్పుడూ కూడా తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తనంతట తానే ఆఫర్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంకీ పాండే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇవన్నీ ఆయన విజయ్‌తో చేసిన సినిమా గురించే చెప్పాడని అంటున్నారు.