- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘శివంగి’ నుంచి మైండ్ హంటర్ సారిక ఫస్ట్ లుక్ రిలీజ్.. సీరియస్ లుక్‌తో భయపెడుతున్న బ్యూటీ(ట్వీట్)

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శివంగి’(shivangi). దీనికి దేవరాజ్ భరణి ధరణ్(Devaraj Bharani Dharan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు(Suresh Babu) నిర్మించారు. అయితే పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి కాషిఫ్ ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న‘శివంగి’ సినిమా నుంచి ఆనంది ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) లాంచ్ చేశారు. ఇందులో ఆనంది ఊహించనవి గెటప్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే శివంగి సినిమాలో వరలక్ష్మి ‘సారిక సింగ్’(Sarika Singh)గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. బ్లాక్ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకుని చేతిలో గన్‌తో సీరియస్‌గా చూస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కాగా ఈ మూవీ మార్చి 7న థియేటర్స్‌లోకి రాబోతుంది.