- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కన్నప్ప’లో ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అసలు విషయం చెప్పిన విష్ణు

దిశ, సినిమా: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa)త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేసిన చిత్ర బృందం.. ప్రతి సోమవారం ఈ మూవీలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన టీజర్ కూడా నెట్టింట విశేషంగా ఆకట్టుకోగా.. కన్నప్ప ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’(Shiva Shiva Shankara) సాంగ్‌తో ఈ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా ‘కన్నప్ప’ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఆకాశాన్ని అంటాయి. దీంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ప్రజెంట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం పలు దేవాలయాలు సందర్శిస్తూ మీడియాతో ముచ్చటిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు(Vishnu), ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohanlal) రెమ్యునరేషన్(Remuneration)కు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా నాన్న మోహన్ బాబు(Mohan Babu)పై ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేశాు. అలాగే మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాలో కాజల్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ బాబు లాంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తూ నటిస్తున్నాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు.