Malavika Mohanan: ఆ స్టార్ హీరో సినిమాలో మాళవిక మోహనన్.. సెట్స్‌లో ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

by sudharani |
Malavika Mohanan: ఆ స్టార్ హీరో సినిమాలో మాళవిక మోహనన్.. సెట్స్‌లో ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ
X

దిశ, సినిమా: మలయాళ (Malayalam) దిగ్గజ డైరెక్టర్స్‌లో ఒకరైన సత్యన్ అంతికాడ్ (Sathyan Antikad) తెరకెక్కిస్తున్న లేటెస్ మూవీ ‘హృదయపూర్వం’ (Hridayapurvam). మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో సాంప్రదాయంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అంతే కాకుండా.. ఫిబ్రవరి 14 నుంచి షూటింగ్ సెట్స్‌లోకి మోహన్ లాల్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘హృదయపూర్వం’ సినిమాలో తాను కూడా భాగం అయినట్లు అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది మాళవిక.

‘ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఈ రోజును అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. మలయాళ చిత్రసీమలోని ఈ ఇద్దరు దిగ్గజాలైన సత్యన్ అంతికాడ్ సర్ & మోహన్‌లాల్ సర్‌తో చేతులు కలపడంతో నా కల నెరవేరింది. ఈ ఇద్దరి సినిమాలను చూస్తూ పెరిగారు. ఇప్పుడు వారితో సినిమా చెయ్యబోతున్నాను. నేను ‘హృదయపూర్వం’ యొక్క అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇద్దరు అపరిచితుల జీవితపు ప్రత్యేకమైన & ఆసక్తికరమైన కూడలిలో కలుసుకునే అందమైన, మంచి అనుభూతిని కలిగించే జీవిత కథ (నేను ఎప్పుడూ చేయాలని కోరుకునే శైలి). ఈ ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి నేను చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నాను’ అంటూ పలు ఫొటోలను పంచుకుంది.

Next Story

Most Viewed