- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్.. మా జీవితంలోకి చిన్నారి రాబోతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు టాక్. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటై 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కియారా అద్వానీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. అయితే ఆ పోస్ట్‌లో తమ చేతిలో లిటిల్ బేబీ సాక్స్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా జీవితంలోకి చిన్నారి రాబోతుంది’ అని క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.