‘ముద్దు ఇచ్చుకుందాం బేబీ’ అంటూ రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ

by Hamsa |   ( Updated:2025-01-23 13:27:41.0  )
‘ముద్దు ఇచ్చుకుందాం బేబీ’ అంటూ రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). రామ్ నారాయణ్(Ram Narayan) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని షైన్ స్క్రీన్ పిక్చర్స్Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ‘లైలా’లో విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టిన మేకర్స్ ‘లైలా’ నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ‘ముద్దు ఇచ్చుకుందాం బేబీ’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆకాంక్ష బికినీ ధరించి రెచ్చిపోయింది. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించగా.. ఆదిత్య ఆర్‌కె(Aditya RK), ఎఎం మానసి పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story