Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ వాయిదా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన చిత్ర బృందం

by sudharani |
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ వాయిదా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన చిత్ర బృందం
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ‘దిల్ రూబా’ (Dil Ruba) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వకరుణ్ (Vishwakaran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ (romantic entertainer)గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానున్నదని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా.. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ‘ఉత్తమమైన వాటిని అందించడానికి మా ‘దిల్‌రూబా’ చిత్రం విడుదల తేదీని పోస్ట్‌పోన్ (Postpone) చేయాలని నిర్ణయించుకున్నాము.. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాము’ అని చెప్పుకొచ్చారు. కాగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా పడినట్లు తెలుస్తుండగా.. మార్చి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed