Kichcha Sudeep: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కిచ్చా సుదీప్.. నా ప్రయాణం ముగుస్తోందంటూ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Kichcha Sudeep: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కిచ్చా సుదీప్.. నా ప్రయాణం ముగుస్తోందంటూ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఇటీవల ‘మ్యాక్స్’(Max) సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఓ వైపు మూవీస్ చేస్తూనే ఆయన సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌బాస్‌(Bigg Boss)లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ప్రసారం అవుతోన్న ఈ షో అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయా చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక కన్నడలో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఏకంగా 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా చేసి ప్రేక్షకులను అలరించారు.

తాజాగా, సుదీప్ హోస్టింగ్‌(Hosting)కు గుడ్ బై చెప్తున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా(Social Media) ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ‘‘దాదాపు 11 సీజన్ల(11 seasons) నుంచి నేను ఎంతగానో ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. హోస్ట్‌గా నాపై విశేషమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలో జరగబోతున్న ఫినాలే(Finale)తో హోస్ట్‌(Host)గా నా ప్రయాణం ముగుస్తోంది. వ్యాఖ్యాతగా నేను మీ అందరికీ వినోదాన్ని మెండుగా అందించాననే భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నాకు సాధ్యమైనంత వరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారు కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Next Story

Most Viewed