Keerthy Suresh: నేను దానికి అడిక్ట్ అయిపోయా.. అయినా నా భర్త ఇబ్బంది పడడు అంటూ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
Keerthy Suresh: నేను దానికి అడిక్ట్ అయిపోయా.. అయినా నా భర్త ఇబ్బంది పడడు అంటూ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘మహానటి’ (Mahanati)సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక ఇటీవల ‘కల్కి’(Kalki) చిత్రంలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన తన గొంతుతో ఎంతోమందిని ఫిదా చేసింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌(Antony Thattil)ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వివాహం తర్వాత హనీమూన్ వెళ్తుందనుకుంటే.. ఆమె నటించి ‘బేబీజాన్’(Baby John)మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల కీర్తి భర్తతో థాయ్‌ల్యాండ్‌(Thailand)కు వెళ్లి వచ్చింది. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన వివాహ జీవితం ఎలా ఉందో వివరించింది. ‘‘పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే సంతోషంగా ఉన్నా. దానికి కారణం నేను ఆంటోని డేటింగ్‌లో ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం.

అందువల్ల నాకు పెద్దగా చేంజ్ అనిపించడం లేదు. అయితే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేను సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయా. ఎక్కువగా దానిని ఉపయోగిస్తుంటాను. అది ఆంటోనికి ఇబ్బందిగా ఉంటుంది. అయినా దాన్ని ఆయన కష్టంగా భావించడు. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో ఆయనే సర్దుకుపోతారు. అందువల్ల మా సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed