Keerthy Suresh: పెళ్లైన రెండు నెలలకే షాకింగ్ నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్.. అస్సలు ఊహించలేదంటున్న నెటిజన్లు!

by Hamsa |
Keerthy Suresh: పెళ్లైన రెండు నెలలకే షాకింగ్ నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్.. అస్సలు ఊహించలేదంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి ‘రెమో’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నేను లోకల్(Nenu Local), రంగ్ దే, భోళా శంకర్, సర్కార్ వారి పాట, వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక ‘మహానటి’(Mahanati ) మూవీతో తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే తమిళ సినిమాల్లోనూ నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక 2023లో ‘దసరా’తో హిట్ సాధించి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జికి తన వాయిస్ ఓవర్ ఇచ్చి మెస్మరైజ్ చేసింది. ఇటీవల కీర్తి సురేష్ ‘బేబీ జాన్’(Baby John) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

కానీ హిట్ సాధించలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ హనీమూన్‌కు వెళ్లకుండా పసుపు తాడుతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచింది కానీ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఇక వివాహ బంధంలో బిజీ అయిపోయిన మహానటి కొత్త సినిమాలు ప్రకటించలేదు. ఈ క్రమంలో.. తాజాగా, కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్. అందుకే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అందరిలాగానే పెళ్లి తర్వాత నటనకు దూరం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పెళ్లైన రెండు నెలలకే ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ప్రస్తుతం కీర్తి సురేష్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Next Story