- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Karthika Deepam : దీప కోసం టిఫిన్ షాప్ కి వెళ్ళిన కార్తీక్ బాబు

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దీప డల్ అవ్వడంతో కాశీ, స్వప్న, కాంచన కలిసి.. కార్తీక్‌ని ఒప్పించి నీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత ,మాది అని అంటారు. అయితే, అప్పుడు దీప వద్దు వద్దు అని అంటుంది. మీరు అలా చేయకండి.. ‘ఆయన మనసుని గాయపరచొద్దనిఅంటుంది. ఇక అప్పుడే శౌర్య అయ్ .. నాన్న వచ్చేస్తున్నాడు .. చూడండి అని అంటుంది. ఇంటి నుంచి కార్తీక్ బాబు.. వాటర్ టిన్ పట్టుకుని.. గళ్ళ లుంగీలో దర్శనమిస్తాడు.. ఆంటే కాదు, మెడలో టవల్ వేసుకుని.. కార్తీక్ బాబు వస్తాడు .. సినిమాలో హీరో ఎలా వస్తాడో ఇక్కడ కూడా కార్తీక్ బాబు అలాగే వస్తాడు. కాశీ అప్పుడు విజిల్ వేస్తాడు.
ఇక వాటర్ టిన్‌ని కిందకి దించాక.. దీప తన భర్తతో ‘మీరేంటి బాబు ఇలా వచ్చారు..’ అని షాక్ అవుతుంది. అంటే ‘రావాలనిపించింది దీపా.. దండెం మీద గళ్లలుంగీ కూడా కనిపించింది, పక్కనే నువ్వు కొనిపెట్టిన చొక్కా కూడా ఉంది.. ఇంకా వేసేసుకుని వచ్చాను ..ఇక్కడ ఇంత గొప్ప శుభకార్యం మొదలుపెడితే నేను మాత్రం ఎలా సైలెంట్ గా ఉంటా .. ఉంటాను.. అందుకే మిమ్మల్ని బాధపెట్టకూడదని నేను వచ్చేశాను’ అని కార్తీక్ అంటాడు. వెంటనే కళ్లనిండా నీళ్లతో థాంక్యూ కార్తీక్ బాబు అని దీప అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.