Kannappa: ‘కన్నప్ప’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. నా జీవితంలో అత్యుత్తమ పాట అంటూ హైప్ పెంచిన విష్ణు (ట్వీట్)

by Hamsa |
Kannappa: ‘కన్నప్ప’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. నా జీవితంలో అత్యుత్తమ పాట అంటూ హైప్ పెంచిన విష్ణు (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(sarathKumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. నిత్యం ఏదో ఒక పాత్రలను రివీల్ చేస్తూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్రను రివీల్ చేశారు. కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాకపోగా.. ఆయన లుక్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. కన్నప్ప ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని తెలుపుతూ రామ జోగయ్య శాస్త్రి ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కన్నప్పలో ఓ పాట రాశాను అని వెల్లడించారు. ఈ క్రమంలో.. తాజాగా, మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. నా జీవితంలో అత్యుత్తమ పాట ఇదే. 10వ తేదీ సోమవారం పాటను ప్రపంచం వ్యాప్తంగా ఉన్నవారంతా వింటారు. నేను వేచి ఉండలేను. ఈ పాట రాసినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు పదాలు దొరకడం లేదు. అంతటి మహిమ శివునికే’’ అని రాసుకొచ్చారు. ఇక విష్ణు ట్వీట్ అందరిలో అంచనాలను పెంచుతోంది. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Next Story