మెట్లపై నుంచి జారి పడిపోయిన కంగనా.. అయ్యో పాపం అనకుండా పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు(వీడియో)

by Kavitha |   ( Updated:2025-03-08 09:57:45.0  )
మెట్లపై నుంచి జారి పడిపోయిన కంగనా.. అయ్యో పాపం అనకుండా పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కంగనా శర్మ(Kangana Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’(Great Grand Masti) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఆమె ‘ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ తన పోస్టులతో నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మోడల్ కంగనా శర్మ ఇటీవల ముంబైలోని ఒక హోటల్ నుంచి బయటకు వచ్చింది. ఆమె నల్లటి బాడీకాన్ డ్రెస్‌తో పాటు హై హీల్డ్ చెప్పులు ధరించింది. అయితే హోటల్ బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చిన కంగనా.. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ పోజు ఇచ్చింది. అయితే అదే సమయంలో తన చెప్పుల కారణంగా బ్యాలెన్స్ కోల్పోయి మెట్ల మీద నుంచి జారి పడింది.

అయితే కంగనా మళ్ళీ లేచి నిలబడి ఫొటోగ్రాఫర్‌కు ఫొటోస్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అసలు నీ డ్రెస్సు నీ అవతారం ఏంటి తల్లి, అందులో అంత హైట్ ఉన్న హీల్స్ అవసరమా అని, కొంచెం పెద్దవి తీసుకోలేక పోయావా అని ఏకి పారేస్తున్నారు. అయితే ఆమె పడిపోయిందని అయ్యో పాపం అనకుండా ఇలా పొట్టు పొట్టుగా తిడుతూ కామెంట్స్ చేయడం గమనార్హం.



Next Story