- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kanchana-4: రాఘవ లారెన్స్‌తో రొమాన్స్ చేయబోతున్న బోల్డ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న న్యూస్

దిశ, సినిమా: స్టార్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘ముని’(Muni). 2007లో విడుదలైన ఈ సినిమా ఓకే ఓకే అనిపించుకుంది. ఇక దానికి సీక్వెల్‌గా 2011లో ‘కాంచన’(Kanchana) మూవీ అందించాడు లారెన్స్. ఈ సినిమా మాత్రం తెలుగు, తమిళంలోనూ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్(Sarathkumar), లారెన్స్ నటనకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఆ సినిమాకు సిక్వెల్‌గా 2015లో వచ్చిన ‘గంగ’(Ganga) (కాంచన 3) కూడా సూపర్ హిట్ అయింది.
ఇక ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంఛైజీ నుంచి ‘కాంచన 4’(Kanchana-4)ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిని గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపించనుండగా.. ఓ పాత్రకోసం ఇప్పటికే పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాంచన4లో రెండో హీరోయిన్‌గా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi)ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.