బెడ్ షేర్ చేసుకోవడానికి తప్ప మగాడితో పనేముంది.. నాగార్జున హీరోయిన్ సంచలన కామెంట్స్

by Kavitha |
బెడ్ షేర్ చేసుకోవడానికి తప్ప మగాడితో పనేముంది.. నాగార్జున హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ టబు(Tabu) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన కూలి నెంబర్ వన్(Coolie No 1) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుకుంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు కూడా కథానాయికగా నటిస్తూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌(Bollywood)లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు పెళ్లి(Marriage) పై సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘వైవాహిక జీవితమే ఓ మనిషి లైఫ్‌ను డిసైడ్ చేయదు. నా లైఫ్ గురించి వేరే వాళ్లు జడ్జ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నాకు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు. ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ సింగిల్‌గా హ్యపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నాను. ఇప్పటికీ కెరియర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను’ అని టబు చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ ఐదు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన సంగతి తెలిసిందే.

Next Story