హద్దులు మీరి పోయిన Krithi Shetty ని లాగిపెట్టి కొట్టిన తల్లి.. అసలు ఏం తప్పు చేసిందంటే..?

by Hamsa |   ( Updated:2023-08-07 08:21:03.0  )
హద్దులు మీరి పోయిన Krithi Shetty ని లాగిపెట్టి కొట్టిన తల్లి.. అసలు ఏం తప్పు చేసిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి కొద్ది రోజులపాటు ఫుల్ ఫామ్‌లో దూసుకుపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కోలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతిశెట్టి కొందరు మెగా హీరోలపై పరోక్షంగా కౌంటర్ వేసిందన్న వార్త ఎంత హాట్ టాపిక్ అయిందో మనకు తెలిసిందే. ఇలా మెగా హీరోస్ పై నోరు పారేసుకున్నందుకు మెగా హీరోస్ హర్ట్ అయ్యారట. తమ కుటుంబంలో ఏ హీరో కూడా అవకాశం ఇవ్వకూడదు అనేసి మాట్లాడుకున్నారట . ఇదే విషయం మీడియాలో వైరల్ కావడంతో ఆ వార్త కృతిశెట్టి అమ్మకు తెలిసిందట. ఆమె అమ్మ గారు హర్ట్ అయ్యింది. ఇదే విషయంలో కృతిశెట్టికి నచ్చ చెప్పడానికి ట్రై చేసిన కృతి శెట్టి ఏ మాత్రం వినలేదట. అందుకే కోపంలో ఆమె లాగి పెట్టి కొట్టిందని నెట్టింట ఓ టాక్ నడుస్తోంది. చూడాలి మరి కృతి శెట్టి దీని పై ఎలా వివరణ ఇస్తుందో.

Advertisement

Next Story