Vijay Devarakonda: VD12 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది అక్కడే!

by sudharani |   ( Updated:2025-01-25 15:50:41.0  )
Vijay Devarakonda: VD12 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది అక్కడే!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) కాంబినేషనల్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘VD12’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ (Surya Devara Nagavamshi) నిర్మిస్తు్న్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ మేరకు VD12 షూటింగ్ అప్‌డేట్ ఇస్తూ.. ‘VD12 చివరి షెడ్యూల్ (Final schedule) ఫిబ్రవరి 6 నుండి వైజాగ్‌ (Vizag)లో ప్రారంభమవుతుంది. అలాగే ఈ షూటింగ్ ఒక నెల పాటు కొనసాగే అవకాశం ఉంది. గతేడాది కూడా స్టీల్ సిటీలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిపారు మేకర్స్. ఈ చిత్రాన్ని ముగించిన తర్వాత, విజయ్ రాహుల్ సంకృత్యాన్ పీరియాడికల్ డ్రామా చిత్రీకరణలో మునిగిపోతాడు’ అంటూ ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులు (Two parts)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా కేవలం ప్రకటనలతోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. VD12 టీజర్ ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed