దానిని భరించలేకపోతున్నా.. ఇప్పటికీ ఆ విషయం గురించి పోరాడాల్సి వస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్ నోట్

by Hamsa |   ( Updated:2025-02-21 09:19:26.0  )
దానిని భరించలేకపోతున్నా.. ఇప్పటికీ ఆ విషయం గురించి పోరాడాల్సి వస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సృష్టి డాంగే(srushtidange) పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఫూల్, చంద్రముఖి-2(Chandramukhi-2), ఓయ్ నిన్నే వంటి సినిమాల్లో నటించింది కానీ అంతగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో మళ్లీ తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, సృష్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన చేదు అనుభవం ఎదురైనట్లు తెలుపుతూ ప్రభు దేవా వైబ్ లైవ్ డ్యాన్స్ కన్సర్ట్‌కు రానని ఖరాఖండిగా చెప్పేసింది. ‘‘ప్రభుదేవా(Prabhu Deva) లైవ్ షోకు నేను రావడం లేదని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాను. ఈ నిర్ణయానికి, ప్రభుదేవాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అయితే నేను వివక్షను భరించలేకపోతున్నాను.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ నాకు దక్కాల్సిన వాటికోసం నేను ఇప్పటికీ పోరాడాల్సి రావడం నిజంగా బాధాకరం. తప్పుడు వాగ్దానాలు, ఇచ్చిన మాట నిలబడకపోవడం నన్ను నిరాశపరిచాయి. అందుకే ఈ కన్సర్ట్‌కు రావద్దని ఫిక్స్ అయ్యాను. ఈ విషయంపై అందరికీ క్షమాపణలు చెప్పడం లేదు. ఎందుకు ఈ షోకు హాజరవడం లేదో కారణం చెప్పాలనుకున్నాను. కుదిరితే మరోసారి మంచి వాతావరణంలో సముచిత గౌరవం దక్కే ప్రదేశంలో మిమ్మల్ని కలుస్తాను. ఫైనల్‌గా ఈ షో నిర్వాహకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. క్రియేటివ్ టీమ్, ఆర్టిస్టులను గౌరవిస్తే బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురు చూశాను. కానీ దురదృష్టవశాత్తు దానికి దూరంగా ఉండక తప్పడం లేదు. ప్రేమతో మీ సృష్టి’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు స్ట్రాంగ్‌గా ఉండమని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed

    null