టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టం అంటూ బాంబు పేల్చిన నేచురల్ బ్యూటీ

by sudharani |
టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టం అంటూ బాంబు పేల్చిన నేచురల్ బ్యూటీ
X

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ హీరోయిన్స్ పేరులో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) నేమ్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. బెంగుళూర్‌కి చెందిన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘సప్త సాగరదాచే ఎల్లో-సైడ్ ఎ’, ‘సప్త సాగరదాచే ఎల్లో- సైడ్ బి’ సినిమాలతో యూత్‌కి కనెక్ట్ అయిపోయిన ఈ అమ్మడు నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత ఏడాది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణీ టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పుకొచ్చింది.

తెలుగులో మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉందని ప్రశ్న ఎదురు కాగా.. దీనిపై ఈ హీరోయిన్ స్పందిస్తూ.. ‘నాకు నాని (Nani)తో వర్క్ చేయడం అంటే ఇష్టం. ఆయన రేంజ్ డిఫరెంట్‌గా ఉంటోంది. ఆయన చేసే సినిమాల్లో ఒక మీనింగ్ ఉంటుంది. ‘అంటే సుందరానికి’, ‘శ్యామ్ సింగరాయ్’ ఇలా వేర్వేరు డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అలాగే ఆయన సినిమాల్లో కామెడీ ఉంటుంది.

Next Story