ఆ సినిమా స్టోరీ నాకు తెలుసు.. పెద్ద హిట్ అవుతుంది.. హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
ఆ సినిమా స్టోరీ నాకు తెలుసు.. పెద్ద హిట్ అవుతుంది.. హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యువ నటులు రవి ప్రకాష్(Ravi Prakash), శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "విద్రోహీ"Vidrohi Movie. ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వీఎస్ వీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా హీరో శ్రీకాంత్ విద్రోహీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘విద్రోహీ ఫస్ట్ లుక్(Vidrohi Movie First Look) పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. నిర్మాత దుర్గారావు, దర్శకుడు వీఎస్ వీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సినిమాలో రవి ప్రకాష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన నాకు మంచి మిత్రుడు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది. టీమ్ అందరికీ విద్రోహి సినిమా పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంచలన హిట్ ఖాతాలో వేసుకున్న భీమ్స్ సిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.







Next Story