- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ విషయం గురించి మాట్లాడితే ప్రభాస్ చంపేస్తా అని అన్నాడు.. మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(Sarathkumar) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు డార్లింగ్ ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభాస్ కేవలం మా నాన్న గారి పై ఉన్న ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమా చేశాడు.
మేము వెళ్లి ఆఫర్ చేస్తే ‘డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా’ అని అన్నాడు. తాను సినిమా ఓకే చేయడమే గొప్ప అనుకుంటే, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక డార్లింగ్ మంచి మనసుకు ఆయన ఫ్యాన్స్ గుడ్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
Megastar Chiranjeevi:జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. చిరంజీవి ఏమన్నారంటే?