Anupama Parameshwaran: యంగ్ హీరోని తన బిగి కౌగిలిలో నలిపేస్తున్న అనుపమ.. వైరల్‌గా మారిన ఫొటో

by Kavitha |   ( Updated:2025-01-19 06:19:54.0  )
Anupama Parameshwaran: యంగ్ హీరోని తన బిగి కౌగిలిలో నలిపేస్తున్న అనుపమ.. వైరల్‌గా మారిన ఫొటో
X

దిశ, సినిమా: గతేడాది ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమాతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’(Dragon). తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మిస్కిన్, కెఎస్ రవికుమార్, విజె సిద్ధు, హర్షత్ ఖాన్, అవినాష్ పి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. డ్రాగన్ మూవీ ఫిబ్రవరి 21న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది.

Advertisement
Next Story

Most Viewed