Sree Vishnu: స్పెషల్ డే నాడు శ్రీవిష్ణు ‘SV-17’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |
Sree Vishnu: స్పెషల్ డే నాడు శ్రీవిష్ణు ‘SV-17’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ శ్రీ విష్ణు(Sree Vishnu ) బ్యాక్ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం తన 17వ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. SV-17 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్(Hussain Shah Kiran) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్స్ ఫర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం(Sandeep Gunnam), వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో రెబా జాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీనికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘SV-17’ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా, మూవీ మేకర్స్ శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 28న టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన అభిమానులకు డబుల్ అప్డేట్స్‌తో ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story