Dhruva Nakshatra: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కు సిద్ధమైన మరో స్టార్ మూవీ.. ‘మదగజరాజ’ సినిమా స్ఫూర్తితోనే అంటున్న డైరెక్టర్

by sudharani |   ( Updated:2025-01-27 15:33:00.0  )
Dhruva Nakshatra: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కు సిద్ధమైన మరో స్టార్ మూవీ.. ‘మదగజరాజ’ సినిమా స్ఫూర్తితోనే అంటున్న డైరెక్టర్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటించిన తాజా చిత్రం ‘మదగజరాజా’ (MadhaGajaRaja). 12ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ మూవీ లేటెస్ట్‌గా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న రిలీజై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో జనవరి 31న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే.. ఇప్పుడు ఇదే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని వాయిదా పడిన తన చిత్రాన్ని రిలీజ్ చేస్తా అంటున్నాడు డైరెక్టర్. స్టార్ హీరో విక్రమ్ (Vikram) హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Nakshatram). స్పై, యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2013లో అనౌన్స్ చేశారు. మొదట ఈ చిత్రాన్ని సూర్యతో ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల చేత ఇది క్యాన్సిల్ కాగా.. 2015లో విక్రమ్‌తో తెరకెక్కించారు. ఇక 2017లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్.

తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ధ్రువ నక్షత్రం’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ చేయడంలో ‘మదగజరాజ’ నాకు స్ఫూర్తినిస్తోంది. దీని రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వస్తే.. కలెక్షన్లు ఎన్ని వస్తాయనే దానిపై కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ‘ధ్రువ నక్షత్రం’ 2025 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. 2023లో ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా.. యూ/ఏ సర్టిఫికెట్ (U/A Certificate) వచ్చింది.




Next Story

Most Viewed