Rashmika Mandanna: రశ్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’పై డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్..

by sudharani |   ( Updated:2024-12-03 16:40:04.0  )
Rashmika Mandanna: రశ్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’పై డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్..
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (Dixit Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ను టీజర్ (teaser) త్వరలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ (Pushpa-2) ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ‘ది గర్ల్ ఫ్రెండ్’పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ రాహుల్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ చూపించాడు. రశ్మిక పర్ఫార్మెన్స్, క్లోజప్ షాట్స్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రాహుల్ తన యాక్టర్స్‌ను బాగా సెలెక్ట్ చేసుకుంటాడు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.

Read More...

Rashmika Mandanna: ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక కట్టుకున్న చీర స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే? ...


Advertisement

Next Story

Most Viewed