Jr NTR: ఎన్టీఆర్‌ను ఆ స్టార్ హీరో పిలిచి మరి అంతలా అవమానించాడా?

by Prasanna |
Jr NTR: ఎన్టీఆర్‌ను ఆ స్టార్ హీరో పిలిచి మరి అంతలా అవమానించాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని, నిలదొక్కుకోవాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే, ఇండస్ట్రీలో కొందరు ఎదగక పోవడానికి ఇతర కారణాలు ఉంటాయి. కానీ, కొందరి విషయంలో మన అని అనుకున్న వాళ్లే దూరం పెడతారు. అయితే, అలాంటి సమయంలో కూడా వెనక్కి తగ్గకుండా పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ). అయితే, ఇతనిని కొన్నేళ్ల వరకు నందమూరి కుటుంబం దగ్గరకు కూడా రానివ్వలేదు.

కనీస గౌరవం కూడా ఒకప్పుడు దొరకలేదు. దీనికి కారణం, హరి కృష్ణ ( Hari Krishna ) మొదటి భార్య లక్ష్మీ ఉండగానే మరో అమ్మాయి శాలిని తో గడిపి జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రి కావడమే. అయితే, ఇలా అవ్వడంతో హరికృష్ణ ను ఎన్టీఆర్ తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఆది తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని తన కుటుంబంలో కలుపుకునేందుకు చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ, రామారావు మరణించాక ఎన్టీఆర్ కి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు నటుడిగా రాణించాలనే కసి ఇంకోవైపు నందమూరి కుటుంబానికి దగ్గరవ్వాలనే ఆశ నిత్యం అతని మనసులో ఉండేవి.

నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ని పిలిచి ఎవరూ పట్టించుకోలేదు. ఆ బాధతో మనస్థాపానికి గురై అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలా ఎన్నో విషయాల్లో అవమానాలు పడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద విజయాలు సాధించి తాతకు తగ్గ మనవడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అవమానించిన వాళ్లే ఇప్పుడు మా వాడే చెప్పుకునేంతలా ఎదిగాడు.

Advertisement

Next Story

Most Viewed