- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dear Krishna: చిత్ర బృందం బంపర్ ఆఫర్.. టికెట్ బుక్ చేసుకున్న వారికి రూ. 10000 క్యాష్ ప్రైజ్

దిశ, సినిమా: అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు (Mamita Baiju), ఐశ్వర్య (Aishwarya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కృష్ణ’ (Dear Krishna). ఎన్ బలరామ్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతన్న ఈ మూవీని పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad), హీరో శ్రీకాంత్ (Srikanth) చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్‌లో ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలి’ అంటూ దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. వినూత్నమైన కథతో, వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయడం నచ్చింది. రియల్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తలకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ చిత్రం మలయాళం తెలుగులో ఒకేసారి విడుదల చేస్తున్నారని, ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్‌లో మరోక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు చిత్ర బృందం. సినిమా టికెట్ బుకింగ్ (Ticket booking) చేస్తే అక్షరాల పదివేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ (Rs. 10000 cash back) కింద బహుమతిగా అందించనున్నట్ల చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు. కాగా.. నిర్మాణంతర పనులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.