- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఛాన్స్ వస్తే ఆ పని చేయడానికి రెడీ’.. క్రేజీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఆనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్(heroine) రీతూ వర్మ(Ritu Varma) గురించి సుపరిచితమే. తెలుగు, తమిళ హిట్ సినిమా(Movies)ల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిల్మ్(Short Film)లతో నటనలో కెరీర్ మొదలు పెట్టింది. మొదట సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన నటనతో హీరోయిన్‌గా ఎదిగింది.
తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే.. పెళ్లి చూపులు మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఎప్పుడు అసభ్యకరమైన సన్నివేశాలలో నటించలేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఆమె చేస్తూ వస్తోంది. ప్రస్తుతం రీతూ వర్మ, హీరో సందీప్ కిషన్(Hero Sandheep Kishan)తో కలిసి మజాకా మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మజాకా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌స్క్రీన్ ముద్దు సన్నివేశాలకు తానువ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు.
ఒక వేళ స్టోరీ డిమాండ్ చేస్తే హగ్, కిస్ సీన్లలో నటించడాని సిద్ధమేనని అన్నారు. ముద్దు సన్నివేశాలకు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు అన్నారు. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడను అని స్పష్టం చేశారు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఓ నిర్ణయానికి వచ్చేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా అని రీతూ వర్మ(Ritu Varma) పేర్కొన్నారు.