Chinmayi: డైరెక్టర్ అట్లీపై కమెడియన్ దారుణమైన కామెంట్స్.. చిన్మయి రియాక్షన్ ఇదే (ట్వీట్)

by Hamsa |
Chinmayi: డైరెక్టర్ అట్లీపై కమెడియన్ దారుణమైన కామెంట్స్.. చిన్మయి రియాక్షన్ ఇదే (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) వరుస చిత్రాలు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’(Baby John). ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ కపిల్ శర్మ(Kapil Sharma) ‘గ్రేట్ ఇండియన్’ షోలో సందడి చేశారు.

అయితే ఈ షోలో భాగంగా కపిల్ శర్మ డైరెక్టర్ అట్లీ కలర్‌ను ఉద్దేశించి వేసిన ప్రశ్న ఆయన అభిమానులకు కోపం తెప్పిస్తోంది. మీరు ఎవరైనా స్టార్‌ను కలిసినప్పుడు.. మిమ్మల్ని అట్లీ ఎక్కడ అని అడిగారా అనడంతో తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ‘‘ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాకు నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్‌కు నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశారు.

అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) స్పందించింది. ‘‘కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్ళు ఎప్పటికీ ఆపలేరేమో. కపిల్ శర్మ పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం నన్ను నిరాశపరిచింది. దురదృష్టవశాత్తూ ఆశ్చర్యం కలగక మానదు’’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story