Chiranjeevi : తల్లి బర్త్ డేని గ్రాండుగా సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. చివర్లో ఎమోషనల్ అయిన అంజనమ్మ ( వీడియో )

by Prasanna |
Chiranjeevi : తల్లి బర్త్ డేని గ్రాండుగా సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. చివర్లో ఎమోషనల్ అయిన అంజనమ్మ  ( వీడియో )
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( Mega Family ) సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే, ఈ ఒక్క కుటుంబంలోనే ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. వీరిలో ఎవరూ సినిమా తీసినా మెగా అభిమానులు అంతా ఒక్కటై వారిని సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఈ సినిమాపై కొందరు నెగిటివ్ ట్రోల్స్ చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ అండగా ఉండి సినిమాని ఖచ్చితంగా చూడాలని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి జనాల్లోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి బుధవారం తన తల్లి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రతీ ఏడాది మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి చిరంజీవి తల్లి అంజనమ్మ ( Anjanamma ) బర్త్ డే ని ఘనంగా చేస్తారు. ఆ సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ , నాగబాబు ఫ్యామిలీ తప్ప మిగతా వారు ఉన్నారు.

ఈ వీడియోలో చిరంజీవి తల్లి నడుచుకుంటూ వస్తున్నప్పుడు పూల వర్షం కురిపించారు. ఆమె లోపలి వచ్చాక అందరూ కలిసి కేక్ కట్ చేయించారు. ఈ సెలబ్రేషన్స్ లో చిరంజీవితో పాటు చరణ్, ఉపాసన ( Upasana ) , మెగా ఫ్యామిలీలోని కొంతమంది వచ్చి ఆమెకి కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చివర్లో అంజనమ్మ.. " ఇది చాలా బాగుంది నాన్న. మీ అందరూ ఇలా కలిసి ఉంటే నాకు ఇంకేం కావలి. మీ అందర్నీ ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందంటూ" ఎమోషనల్ అయింది.

ఈ వీడియోని చిరంజీవి షేర్ చేస్తూ.. " అమ్మా.. ఈ ప్రత్యేకమైన రోజున మేమంతా నిన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నాము, నువ్వు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ గౌరవిస్తున్నామని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీకి హార్ట్ నువ్వు, మా అందరి బలం నువ్వు. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అంటే అది నువ్వే. 
నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి " అంటూ పోస్ట్ చేసారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి..

Next Story