ఛత్రపతి శివాజీ బర్త్ డే స్పెషల్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన రిషబ్ శెట్టి

by Hamsa |
ఛత్రపతి శివాజీ బర్త్ డే స్పెషల్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన రిషబ్ శెట్టి
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ (Kantara)సినిమాతో హిట్ అందుకుని అదే ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సీక్వెల్స్‌లో నటిస్తున్నారు. ఓ వైపు దర్శకుడిగా పలు చిత్రాలు తెరకెక్కి్స్తూనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’(Jai Hanuman)లో కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక సందీప్ సింగ్ దర్శకత్వంలో ‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్’(The Pride of India: Chhatrapati Shivaji Maharaj) మూవీ చేస్తున్నారు.

ఇందులో శివాజీ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో 2027 జనవరి 21న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన చూసేందుకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటలు కూడా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. నేడు ఛత్రపతి శివాజీ పుట్టినరోజు కావడం రిషబ్ శెట్టి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్’ నుంచి ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో అమ్మవారు సింహం కూర్చొని ఉండగా.. ఆమె ముందు కత్తి పట్టుకుని ఛత్రపతి శివాజీ నిలుచునట్లుగా కనిపించారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story