- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘దిల్ రూబా’ నుంచి బ్రేకప్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు. కానీ రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఈ చిత్రం నుంచి లవ్ బ్రేకప్ సాంగ్ రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోలో ఈ పాట లిరిక్స్ ఇస్తూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అవుతున్న సీన్స్‌ను యాడ్ చేశారు. అయితే ‘సోల్ ఫుల్ ‘బ్రేకప్ సింగిల్ ఆన్‌ది వే.. అంటూ ‘కన్నా నీ’ అనే సాంగ్ రేపు సాయంత్రం 5 గంటల 1నిమిషానికి రానున్నట్లు ప్రకటించారు. ఇక లిరిక్స్ చూస్తే మనసా మనసా అలసిపోకే.. కలగా కలగా కలిగిపోయే.. తననే తననే మరిచిపోవే మనసా’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా సాడ్‌గా అనిపిస్తుంది.