టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ‘జటాధర’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. వామ్మో చంద్రముఖిలా భయపెడుతుందిగా

by Kavitha |   ( Updated:9 March 2025 12:06 PM  )
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ‘జటాధర’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. వామ్మో చంద్రముఖిలా భయపెడుతుందిగా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘జటాధర’(Jatadhara). ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందని చాలా రూమర్స్ వచ్చాయి.

ఇక వాటిని నిజం చేస్తూ.. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్ట్‌ను పెడుతూ.. సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్‌(First Look)ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పోస్టర్‌ను చూసినట్లయితే.. ఫియర్ లుక్‌లో సేమ్ చంద్రముఖిలా జుట్టు విరబోసుకుని కనిపించింది సోనాక్షి.

అలాగే బ్లాక్ బొట్టు పిల్ల దానికి కింద అడ్డంగా తెల్ల విభూది పెట్టుకుంది. ఫేస్ కనపడకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించేటట్టు చేతులు అడ్డంగా పెట్టుకుంది. అయితే ఆ వేళ్లకు అంత పెద్ద పెద్ద గోర్లతో ఘోరంగా భయపెడుతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Next Story

Most Viewed