Bigg Boss Telugu 7 Telugu: వారానికే భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కిరణ్ రాథోడ్!

by Hamsa |   ( Updated:2023-09-11 08:33:54.0  )
Bigg Boss Telugu 7 Telugu: వారానికే భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కిరణ్ రాథోడ్!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్-7 సీజన్ ఇటీవల స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి టాస్క్ లో పాల్గొంటున్నారు. అయితే గ్ బాస్ సీజన్ 7 సక్సెస్‌ ఫుల్‌గా ఫస్ట్‌ వీక్‌ను కంప్లీట్‌ చేసుకుంది. అందరూ అనుకున్నట్లే ప్రముఖ నటి కిరణ్‌ రాథోడ్‌ బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కేవలం ఇంగ్లిష్‌లోనే మాట్లాడిన ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లో అందరితో కలవలేకపోయింది.

టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేయలేకపోయింది. ఇక తెలుగు రాదనే వంకతో హౌజ్‌మేట్స్‌ అందరూ కిరణ్‌నే నామినేట్‌ చేశారు. ఇక తెలుగు రాకపోవడంతో బిగ్‌బాస్‌ ఓటర్లు కూడా అందరికంటే ఆమెకే తక్కువ ఓట్లు వేశారు. దీంతో ఆమె మొదటి వారంలోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే కిరణ్ రాథోడ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. హౌస్‌లో వారం రోజులు ఉన్నందుకు కిరణ్ రోజుకు రూ. 45 వేల చొప్పున భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed