- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Balakrishna 'Akhanda-2' బాలయ్య ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘అఖండ-2’ నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ అప్పుడే!

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే 2023లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagwant Kesari), 2024లో వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2025లో కూడా పోటీకి సిద్ధం అయ్యాడు బాలయ్య. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ-2’ (Akhanda-2). 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్, బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’కు (Akhanda) సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా పార్ట్ -2పై భారీ అంచాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబధించి ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ కాగా.. ఇప్పటికే వదిలిన పలు అప్‌డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రజెంట్ షూటింగ్ (Shooting) శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి బాలకృష్ణ ఫస్ట్‌లుక్ (First look)ను ఈ నెల చివరిలో మహా శివరాత్రి (Maha Shivratri) సంద్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్‌గా మారడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బాలయ్య బాబు కూతురు ఎం. తేజస్విని నందమూరి (Tejaswini Nandamuri) సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా బాలకృష్ణ ‘అఖండ-2’లో రెండు భిన్నమైన పాత్రల్లో కనువిందు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.