Arun Vijay: ఇట్స్ అఫీషియల్.. అరుణ్ విజయ్ ‘వనంగాన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by Hamsa |
Arun Vijay: ఇట్స్ అఫీషియల్.. అరుణ్ విజయ్ ‘వనంగాన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘వనంగాన్’(Vanangaan). డైరెక్టర్ బాలా(Bala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రోషిణి ప్రకాష్(Roshini Prakash) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సముద్రఖని(Samuthirakani), చాలా దేవి, జార్డ్ మరియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే దీనిని వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ కామచ్చి(Suresh Kamatchi) నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి జీవీ ప్రకాషం సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అరుణ్ షాకింగ్‌ లుక్‌ను షేర్ చేశాడు. ‘వనంగాన్’ చిత్రం పొంగల్, సంక్రాంతి కానుకగా జనవరి 10న తేదీన థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు.

Next Story

Most Viewed