- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anushka Shetty: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన అనుష్క శెట్టి.. ప్రభాస్ రియాక్షన్ ఇదే! (పోస్ట్)

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’(Super) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో నాగార్జున(Nagarjuna) హీరోగా నటించగా.. పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్, వెంకటేష్, రవితేజ (Ravi Teja)వంటి వారితో నటించి మెప్పించింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటించిన అనుష్క తన నటనతో అందరినీ ఫిదా చేసింది. ఇక బాహుబలి-1, బాహుబలి-2(Baahubali-2) సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.
కానీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా అయింది. మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty)చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఏడాది పాటు కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ప్రస్తుతం ‘ఘాటి’(Ghati) మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి(Rajeev Reddy), సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. అయితే దీనికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న థియేటర్స్‌లోకి రానుంది.
ఇప్పటికే ‘ఘాటి’ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్క శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. మెరున్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఫ్రీ హెయిర్‌లో ఉన్న పిక్ షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆమె అంత బొద్దుగా ఉందేంటి అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఓ నెటిజన్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ఓ ఏమెజీని షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. మరికొంతమంది నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.