ధనుష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న స్టార్ హీరో.. హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటున్న నెటిజన్లు

by Hamsa |
ధనుష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న స్టార్ హీరో.. హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏ హీరో చేయని విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇటీవల ధనుష్ తెరకెక్కించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ధనుష్ ఓ స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అజిత్ కుమార్ హీరోగా.. ధనుష్ దర్శకుడిగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించిన పనులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియనప్పటికీ వీరిద్దరి కాంబో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఇది గనుక కన్ఫర్మ్ అయితే కోలీవుడ్‌లో ఈ సెన్సేషన్ కాంబో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. కాగా, అజిత్ కుమార్ ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story