‘రాబిన్‌హుడ్‌’ మూవీలో కీలక పాత్రలో ఆదిపురుష్ నటుడు.. వైల్డ్ పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచిన మేకర్స్

by Hamsa |
‘రాబిన్‌హుడ్‌’ మూవీలో కీలక పాత్రలో ఆదిపురుష్ నటుడు.. వైల్డ్ పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల(Sreeleela ) కలిసి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). ఈ సినిమాను భీష్మ వంటి హిట్ మూవీస్ అందించిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది.

మేకర్స్ ఈ విషయాన్ని చివరి నిమిషంలో ప్రకటించడంతో నితిన్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలై పోస్టర్స్, టీజర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం ‘రాబిన్‌హుడ్’ అప్డేట్‌ ఇచ్చారు. ఆదిపురుష్‌లో హనుమాన్‌గా నటించిన దేవదత్తా నాగే పుట్టిన రోజు సందర్భంగా ఆయన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో స్వామి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ వైల్డ్ లుక్‌ను నెట్టింట పెట్టారు. ఇందులో ఆయన గుబురు గడ్డంతో ఓ జీప్‌పై కూర్చొని సిగరెట్ తాగుతూ కోపంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇక అది చూస్తుంటే ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది.

Next Story

Most Viewed