- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆందోళన చేస్తే అంతు చూస్తా: సీఐ వార్నింగ్
దిశ ప్రతినిధి, మేడ్చల్: పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరోసారి ఆందోళన బాట పట్టారు. మంగళవారం మేడ్చల్ జిల్లా బోయిన్ పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ వద్ద బైఠాయించారు. వందలాది మంది పేరెంట్స్ స్కూల్ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తూ.. ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ అంజయ్య ఓ పేరెంట్‌కు ఫోన్ చేసి ఆందోళన చేయవద్దని హెచ్చరించాడు. వారి సంభాషణ ఇలా సాగింది. పేరెంట్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన పెంచిన ఫీజులపై ధర్నా చేయగా, 21న చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. తీర వస్తే పట్టించుకోవడం లేదు.
దీనికి సీఐ స్పందిస్తూ..ధర్నా చేయడం వల్ల ఉపయోగం ఉండదని, అవసరమైతే విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చాడు . లేదు సార్ మేము ధర్నా చేయడం లేదు.. యాజమాన్యం రమ్మంటే వెళ్తున్నామనగా, వీరిద్దరి మధ్య మాటామాట పెరిగింది. సీఐ అంజయ్య నీవు పేరెంట్స్‌ను సమీకరించి ఆందోళన చేయిస్తున్నావ్.. నీ చిట్టా మొత్తం తీస్తానని బెదిరించాడు. పేరెంట్ కూడా నీ చిట్టా నేను తీస్తా.. నేనేమి భయపడడంలేదు అని సమాధానం ఇచ్చాడు. దీంతో సీఐ, పేరెంట్ మధ్యన నీవు ఎంత అంటే నీవు ఎంత అనే రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. ఈ ఆడియో వాట్సప్‌లో హల్ చల్ చేస్తుంది. సీఐ అదేశాల మేరకు పోలీసులు పేరెంట్ ను ఆదుపులోకి తీసుకునేందుకు యత్నించిగా, మిగితా పేరెంట్స్ పోలీస్ మొబైల్ వాహన లాక్‌ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో కొద్దిసేపు సెయింట్ ఆండ్రూస్ స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగించాడు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సుజాత, విజయ్ లు మాట్లాడుతూ.. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులను పెంచిందని, ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తూ.. కరోనా కష్టకాలంలో ఫీజులు చేల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. స్పందించకుంటే ఆన్ లైన్ క్లాసుల లింకు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఈ నెల 14వ తేదీన కూడా ఆందోళన చేపట్టామని, ఈ రోజు(మంగళవారం) వస్తే చర్చిస్తామని స్కూల్ యాజమాన్యం నచ్చజెప్పి పంపిందని, తీరా ఇక్కడికి వస్తే.. స్కూల్ గేట్లు కూడా తీయకుండా మమ్మిల్ని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లోపలికి పిలిచి పేరెంట్స్ తో మాట్లాడాలని అడిగితే కరోనా వచ్చిందని అబద్దాలు అడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పేరెంట్స్ స్కూల్ గేటుకు ఓ వినతి పత్రం అంటించి వెనుదిరిగారు.