- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గేల్ అంకుల్.. రాత్రి తాగింది దిగలేదా?
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అటు ఫీల్డ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘చాహల్ టీవీ’తో సందడి చేసే యజ్జీకి ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా సామాజిక మాధ్యమాలే దిక్కయ్యాయి. అతడు టిక్‌టాక్‌లో చేసే వీడియోలపై అభిమానులే కాక, స్వయంగా టీమ్ఇండియా క్రికెటర్లు కూడా ఆటపట్టిస్తుంటారు. గతంలో ఒకసారి ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా చాహల్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు క్రిస్ గేల్ చేసిన కామెంట్‌కు చాహల్ నివ్వెరపోయే రిప్లై ఇచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా, కివీస్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో మార్టిన్ గప్తిల్‌ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వీడియోను చాహల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా గేల్ కామెంట్ చేశాడు. ‘చాహల్.. క్రీజు బయట కాలు పెట్టి బాల్ వేశాడు. ఇది నోబాల్ అంపైర్ అని కామెంట్ చేయగా చాహల్ ‘హ హ.. గేల్ అంకుల్ గతరాత్రి ప్రభావం ఇంకా ఉందా’ అని పంచ్ విసిరాడు. అంటే గత రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని చాహల్ కామెంట్ చేశాడు. ఇప్పుడీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.