- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లూసిఫర్’ రీమేక్.. ఫైనల్ అయిన డైరెక్టర్!
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ చిరంజీవి తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, చిరు 153వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘తనిఒరువన్’ డైరెక్టర్ మోహన్ రాజాను ఫైనల్ చేశారు చిరు. జనవరి 2021 నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న సినిమా ఏప్రిల్‌లో పూర్తవుతుందని తెలిపారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్ సిద్ధం కాగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి తన చిరకాల మిత్రుడు ఎన్‌వీ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు.
#MegaStar153 #Lucifer movie Telugu remake will be directed by @Jayam_Mohanraja and jointly produced by @KonidelaPro & NVR Cinema.
#MegaStar @KChiruTweets will join the sets after Sankranthi 2021. pic.twitter.com/r5t0ZiuWo9
— Konidela Pro Company (@KonidelaPro) December 16, 2020
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిరు ‘హిట్లర్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మోహన్ రాజా.. ప్రస్తుతం చిరును డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాగా తమిళ్‌లో సూపర్ సక్సెస్ ట్రాక్ ఉన్న మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంపై నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ అద్భుతంగా మలిచారని.. బాస్ సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తామన్నారు.