జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం

by Shyam |
జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం
X

దిశ, సినిమా: నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం అందించారు. తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలు అందజేశారు. టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసి పరామర్శించిన ఆయన.. తన మేనేజర్‌ ద్వారా డబ్బులు అందించారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు చూశానన్న చిరు.. తను ఇంటర్వ్యూ చేసే విధానం ఎంతగానో ఆకట్టుకునేదని తెలిపారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Advertisement

Next Story