- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేసిన చైనా
దిశ, ఫీచర్స్ : డ్రాగన్ కంట్రీ చైనా టెక్నాలజీ పరంగా ప్రపంచదేశాల్లో ముందున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశ శాస్త్రవేత్తలు తాజగా వరల్డ్స్ ఫాస్టె్స్ట్ ప్రోగ్రామబుల్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేశారు. పాన్ జియాన్‌వీ నేతృత్వంలో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా (USTC) రీసెర్చర్స్ రూపొందించిన ‘జుచోంగ్జి 2.1’ అని పిలువబడే క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్.. దాని సమీప పోటీదారు కంటే మిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్స్
‘జుచోంగ్జి 2.1’.. గూగుల్ సైకామోర్ కంప్యూటింగ్ సిస్టమ్ కంటే 10 మిలియన్ రెట్లు వేగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తుంది. కాగా చైనా సైంటిస్టులు అభివృద్ధి చేసిన క్వాంటమ్ కంప్యూటర్స్ సిరీస్‌లో ‘జియు జాంగ్ 2’ కూడా ఒకటి. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా చెలామణిలో ఉన్న ‘గూగుల్ సైకామోర్’ కంటే 100 ట్రిలియన్ రెట్లు వేగంగా కాలిక్యులేషన్స్ చేయగలదని తాజాగా ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో ప్రచురించిన డిఫరెంట్ స్టడీలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూపర్-అడ్వాన్స్‌డ్ మెషిన్స్‌గా పరిగణించబడే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ 1s, 0s బైనరీ కోడ్స్.. ‘బిట్’ అని పిలువబడే బేసిక్ యూనిట్ సమాచార రూపంలో ట్రెడిషనల్ కంప్యూటర్స్‌లో నిల్వ చేయబడతాయి.
ఈ అధునాతన కంప్యూటర్స్ విశ్వంలో ఉన్న అతిచిన్న కణాల ప్రత్యేక లక్షణాలను ఉపయోగించుకుంటాయి. ఇవి మల్టీపుల్ స్టేట్స్ – ట్రెడిషనల్ కంప్యూటర్స్‌కు సమానమైన 1s, 0s లేదా వాటి మధ్య గల ఏదైనా స్థానంలో ఉండవచ్చు. క్వాంటమ్ కణాలు చాలా సరళంగా ఉంటాయి. వీటిని ‘క్విట్స్’ లేదా ‘క్వాంటమ్ బిట్స్’ అని పిలుస్తారు. ఈ క్విట్స్‌ను సూపర్‌కంప్యూటర్స్ ద్వారా ఏకకాలంలో నిర్వహించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఎంత ఎక్కువైతే అంత మంచిది..
చైనీస్ పరిశోధకులు క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు రెండు వేర్వేరు వ్యవస్థలను నిర్మించారు. అందులో కాంతి-ఆధారిత ఫోటోనిక్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఒకటి. కాగా చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే సమర్థవంతంగా అమలు చేయగల సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్స్ వ్యవస్థ మరొకటి. మునుపటి రకంలో ఫోటాన్లుగా పిలువబడే కాంతి శక్తి యూనిట్లు.. మిర్రర్స్, ఫేజ్ షిఫ్టర్స్, బీమ్ స్ప్లిట్టర్స్ ఉపయోగించి సర్దుబాటు చేయబడేవి. తర్వాతి కాలంలో క్యూబిట్స్ స్థితి విద్యుదయస్కాంత క్షేత్రం ద్వారా మార్చబడింది. అయితే అటువంటి సూపర్ కంప్యూటర్స్.. అంత త్వరగా ట్రెడిషనల్ కంప్యూటర్స్‌ను భర్తీ చేయడం లేదు. కానీ ఇవి తక్కువ వ్యవధిలో స్పెసిఫిక్ కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ నిర్వహిస్తాయి.