అమిత్ షా అరుణాచల్‌ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం

by Shamantha N |
అమిత్ షా అరుణాచల్‌ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర హోదా దినోత్సవానికి హాజరయ్యేందుకు అమిత్ షా ఆ రాష్ట్రం చేరారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని, ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ విశ్వాసాన్ని భంగపరుస్తుందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌ అంతర్భాగంగా చూసుకునే చైనా.. దక్షిణ టిబెట్ రీజియన్‌పై తమ దేశ వైఖరి స్థిరంగా ఉన్నదని ఆ దేశ విదేశాంగ మంత్రి గేంగ్ షువాంగ్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ భారతీయ నాయకుడైనా పర్యటించినప్పుడు తమ వాదనను వినిపించేందుకు చైనా సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ సరిహద్దు వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు ఇప్పటికి దాదాపు 22 రౌండ్లు చర్చలు జరిపారు.

Advertisement

Next Story

Most Viewed