ఒంటెలు ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్

by Sujitha Rachapalli |
ఒంటెలు ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్
X

దిశ, ఫీచర్స్ : ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి రహదారి కూడళ్లు, పాదచారుల క్రాసింగ్స్‌తో పాటు ఇతర ప్రదేశాల వద్ద ట్రాఫిక్ లైట్లు, సిగ్నళ్లను ఉపయోగిస్తుంటాం. అయితే రోడ్డు దాటేటప్పుడు మనుషులే కాదు, మూగ జీవులు కూడా ప్రమాదానికి గురవుతుంటాయి. ఈ క్రమంలో పలు చోట్ల జంతువుల కోసం వంతెనల నిర్మాణం చేపడుతుండగా.. ఉత్తరాఖండ్ అటవీశాఖ కూడా ఎకో ఫ్రెండ్లీ వంతెన నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా చైనాలో ఒంటెల కోసం ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడం విశేషం.

ఇటీవలి కాలంలో చైనా, డున్‌హ్యుయంగ్ నగరంలోని ‘మింగ్షా మౌంటెయిన్ అండ్ క్రిసెంట్ మూన్ స్ప్రింగ్’ టూరిస్ట్ స్పాట్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగింది. విండ్‌బ్లోన్ దిబ్బలతో చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే అక్కడి ఇసుక తిన్నెల్లో నడుస్తున్నా లేదా గాలి వీచినా డ్రమ్స్ లేదా ఉరుములతో కూడిన సౌండ్స్ వినిపిస్తాయి. అందుకే దీన్ని ‘సింగింగ్ శాండ్స్ మౌంటెయిన్’‌గా పిలుస్తుంటారు. ప్రధానంగా ఎడారి ప్రాంతంలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడాన్ని సందర్శకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ క్యామెల్ రైడ్ స్పెషల్ అట్రాక్షన్ కాగా, ఒంటెపై స్వారీ చేసే సయమంలో మిగతా ఒంటెలతో యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కాగా ఒంటెల కోసం ఈ తరహా ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేసిన తొలి దేశం తమదేనని చైనా అధికారులు చెబుతున్నారు. సాధారణ ట్రాఫిక్ సిగ్నల్ మాదిరిగానే, ఒంటెలు రహదారిని దాటడానికి గ్రీన్ సిగ్నల్, వాటిని ఆపడానికి ఎరుపు రంగు సిగ్నల్స్ అమర్చారు.

Advertisement

Next Story

Most Viewed