ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన చిన్నారి.. ఒళ్లంతా చీమలు, ముళ్లు గుచ్చుకుని..!

by Sumithra |
ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన చిన్నారి.. ఒళ్లంతా చీమలు, ముళ్లు గుచ్చుకుని..!
X

దిశ, మేళ్లచెరువు : ఉమ్మడి నల్గొండ జిల్లా పులిచింతల ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మేళ్లచెరువు మండలంలోని వజినేపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి అప్పుడే జన్మించిన పసి పాపను తీసుకొచ్చి ఎవరూ చూడకముందు ముళ్ళ కంపలో పడవేసినట్టు తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన విశ్వేశ్వరరావు రాజు నాగరాజు అటువైపుగా ఫ్యాక్టరీకి వెళుతుండగా మార్గమధ్యంలో ఉన్న ముళ్ళ పొదల్లో చిన్నారి ఏడుపు వినిపించింది. సమీపంలోని ముళ్లపొదల్లో వెతుకగా అక్కడ ఒక ఆడ శిశువు కనిపించింది. ఆ శిశువు శరీరంపై చీమలు ఉండటంతో ఇంటికి తీసుకొచ్చి వాటిని తొలగించాడు. ఆ తర్వాత శరీరంపై ఉన్న ముళ్ళను శుభ్రం చేసి వెంటనే స్థానికంగా ఉన్న అంగన్ వాడీ టీచర్స్ భూ లక్ష్మి, రమాదేవికి సమాచారం అందించాడు.

ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించి పై అధికారి కోదాడ సీడీపీఓ అనంతలక్ష్మికి విషయం తెలియపరచగా ఆమె శిశువును పరిశీలించింది. ఆ శిశువు పై చిన్నపాటి గాయాలు చీమలు కుట్టినట్టు ఉండటాన్ని గ్రహించి వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేయించిన తర్వాత సూర్యాపేట మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పసికందును ఈ విధంగా అడవిలోకి తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోతే కుక్కలు లేదా అడవి జంతువులు దాడి చేస్తే పరిస్థితి ఎంటని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed